
ఏపీలో వాతావరణ మార్పులు: ఆ జిల్లాల్లో మోస్తరు వర్షాలు, పిడుగుల హెచ్చరిక!
రాబోయే 24 గంటల్లో అల్పపీడనం గుజరాత్, రాజస్థాన్ మీదుగా వాయవ్య దిశగా పయనించే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (SDMA) వెల్లడించింది.
దీని ప్రభావంతో రేపు ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో వాతావరణం చల్లబడనుంది.ముఖ్యంగా మన్యం, అల్లూరి, పోలవరం, కాకినాడ, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, మార్కాపురం, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో కూడా అక్కడక్కడ చిరుజల్లులు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
వర్షాలతో పాటు పలుచోట్ల పిడుగులు పడే ప్రమాదం పొంచి ఉన్నందున ప్రజలు, రైతులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, పొలాల వద్ద చెట్ల కింద నిలబడవద్దని అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు.





